Citadel Honey Bunny

Citadel Honey Bunny: అందుబాటులో సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ

Citadel Honey Bunny: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ కూడా అదిరిపోయే హిట్ అందుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్2’ ఇచ్చిన విజయంతో సమంత చేసిన రెండో వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలసి సమంత నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ ని దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఈ సిరీస్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ ని అమేజాన్ ప్రైమ్ వీడియో మొత్తం 20 భాషల్లో అందుబాటులోకి తెచ్చింది. 6 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సీరీస్ యావరేజ్ నిడివి 50 నిమిషాల పాటు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరూ ఓ లుక్కేయండి. సమంత యాక్షన్ ని చూసేయండి.

ఇది కూడా చదవండి: Dhoom Dhaam: ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ తో ‘ధూం ధాం’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *