Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన అల్లు అర్జున్. ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు జైలు నుంచి నేరుగా గీత ఆర్ట్స్ కీ వెళ్లారు. అక్కడే కొంత సమయం ఉన్న అల్లు అర్జున్ అల్లు అరవింద్. తర్వాత అక్కడ నుంచి నేరుగా నివాసానికి చేరుకున్నారు. అది విషయం తెలిసిన వెంటనే అల్లు అర్జున్ ని పరామర్శించడానికి సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నారు.
తాజాగా ఆయన్ని దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తదితరులు అల్లు అర్జున్ ని కలిశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై సినీ ప్రముఖులు ఏమన్నారంటే?
అల్లు అర్జున్ ను కలిసిన టీడీపీ ఎమెల్యే గంట శ్రీనివాస రావు@alluarjun@Ganta_Srinivasa #AlluArjunBail #AlluArjunArrest #AlluArjun𓃵 pic.twitter.com/ycPpw8LGXg
— TeluguOne (@Theteluguone) December 14, 2024
రానా దగ్గుబాటిని గట్టిగా హాగ్ చేసుకోని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్@alluarjun #RanaDaggubati #AlluArjun #AlluArjunArrest #AlluArjunBail pic.twitter.com/yJ3ZJhUaw3
— TeluguOne (@Theteluguone) December 14, 2024
#Sukumar sir ” We Love You ” ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024
జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కి వెళ్లిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అరెస్ట్ అయి రిమాండ్ కు సినీ హీరో అల్లు అర్జున్ ను పంపించిన విషయం తెలిసిందే. ఆయనకు నిన్ననే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ నిన్ననే విడుదల అవుతారని భావించారు. అయితే టెక్నీకల్ అంశాల కారణంగా ఆయనను ఈరోజు అంటే శనివారం ఉదయం 6:40 గంటలకు జైలు నుంచి విడుదల చేశారు. బన్నీ జైలు నుంచి విడుదల కానున్నారనే సమాచారంతో అభిమానులు పెద్ద సంఖ్యలో చంచల్ గూడా జైలు దగ్గరకు చేరుకున్నారు. దీంతో జైలు అధికారులు ఆయనను వెనుక గేటు గుండా బయటకు పంపించారు. అల్లు అర్జున్ తన సొంత కారులో జైలు నుంచి బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ అదే కారులో వెళ్లారు. అల్లు అర్జున్ కారుకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు.
ఇక జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే చాలా సేపు అయన ఉన్నారు. గీతా ఆర్ట్స్ కేరాలయం వద్ద నిర్మాత దిల్ రాజు, మరికొంత మంది సినీ ప్రముఖులు మరోవైపు అల్లు అర్జున్ ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ ఇంటివైపు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు.