New GST Slabs

New GST Slabs: అనారోగ్యాన్ని కొన్నుకోవాలి అంటే.. ఇక్క మీద 40 శాతం పన్ను చెల్లించాల్సిందే

New GST Slabs: జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా సాధారణ వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపే విధంగా కొన్ని ఉత్పత్తులపై జీఎస్టీ భారీగా పెంచుతూ, మరికొన్నింటిపై తగ్గింపు ప్రకటించింది. ముఖ్యంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా, జర్దా వంటి అన్ని పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ రేటు 28% నుంచి 40%కు పెరిగింది. ఈ కొత్త పన్ను రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

పొగాకు ఉత్పత్తులతో పాటు లగ్జరీ కార్లు, ఫాస్ట్ ఫుడ్, కార్బోనేటెడ్ చక్కెర పానీయాలు వంటి అనేక వస్తువులు కూడా 40% జీఎస్టీ శ్లాబ్‌లోకి చేరాయి. దీంతో ఈ వస్తువుల ధరలు భారీగా పెరగడం ఖాయం.

పొగాకు ఉత్పత్తుల ధరల్లో భారీ పెరుగుదల

ప్రభుత్వ నిర్ణయం కారణంగా సిగరెట్‌, పాన్ మసాలా వాడేవారి ఖర్చులు పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.256కు లభిస్తున్న సిగరెట్ ప్యాకెట్ ధర కొత్త రేట్ల ప్రకారం రూ.280 దాతనునాటు తెలుస్తుంది.  గుట్కా, జర్దా, నమిలే పొగాకు వంటి ఉత్పత్తులపై కూడా ఇదే రీతిలో ధరల పెరుగుదల ఉండనుంది.ఉత్పత్తులపై ఇప్పటికే అధిక పన్ను, సెస్ ఉండటంతో వినియోగదారులపై మరింత భారం పడుతుంది.ఈ విధంగైన పెరిగిన దారాలని దుష్టిలో పెట్టుకొని మధ్య తరగతి జనాలు వీటికి దూరం గా ఉంటారో లేదో చూడాలి.. లేదా ఖరీదు ఎక్కువైనా  పేర్లేదు అని అనారోగ్యాన్ని కొనుకుంటారో చూడాలి..

40% పన్ను కిందకి వచ్చిన వస్తువులు

  • ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్

  • కార్బోనేటెడ్, రుచిగల చక్కెర పానీయాలు

  • సూపర్ లగ్జరీ కార్లు, వ్యక్తిగత విమానాలు

  • అదనపు చక్కెర ఉత్పత్తులు, జర్దా మొదలైనవి

రిటైల్ ధర ఆధారంగా పన్ను లెక్కింపు

మునుపటిలా లావాదేవీ విలువ ఆధారంగా కాకుండా, ఇప్పుడు రిటైల్ అమ్మకపు ధర (RSP) ఆధారంగా పన్ను విధించనున్నారు. ఇది పన్ను ఎగవేతను అరికట్టడానికి తీసుకున్న చర్య. కంపెనీలు కొత్త నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే.

ఇది కూడా చదవండి: New GST Slabs: మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!

పన్ను శ్లాబుల్లో పెద్ద మార్పులు

  • ఇప్పటి వరకు అమల్లో ఉన్న 12%, 28% శ్లాబులను రద్దు చేశారు.

  • చాలా వస్తువులు ఇకపై 5% లేదా 18% శ్లాబుల్లోనే ఉండనున్నాయి.

  • మధ్యతరగతి వినియోగించే కొన్ని ఉత్పత్తులు ఈ మార్పు కారణంగా చౌకబడే అవకాశం ఉంది.

నిర్ణయాల వెనక ఉద్దేశ్యం

ప్రభుత్వం ఈ ఉత్పత్తులను విలాస వస్తువుల వర్గంలోకి చేర్చింది. పొగాకు, తీపి పానీయాలు వంటి వస్తువులు ఆరోగ్యం, పర్యావరణానికి హానికరమని గుర్తిస్తూ వాటి వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో జీఎస్టీ రేట్లు పెంచింది.

ALSO READ  India-China: భారత్-చైనా సరిహద్దుల్లో సైనికులు పూర్తిగా వెనక్కి

మొత్తంగా, ఈ నిర్ణయం ప్రభుత్వ పన్ను వసూలును పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి హానికరమైన వస్తువుల వినియోగాన్ని నియంత్రించడంపై దృష్టి సారించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *