Lokesh

Lokesh: నామీనందుకు రూ 3కోట్ల మోసం చేసిన హీరో.. బాధితుడు ఆత్మహత్యాయత్నం

Lokesh: రైల్వే కాంట్రాక్టుల పేరుతో తనను నమ్మించి భారీగా నగదు వసూలు చేసి మోసం చేశారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘జెట్టి’ సినిమా హీరో మాన్యం మురళీకృష్ణ తన వద్ద నుండి సుమారు రూ. 3.15 కోట్లు తీసుకుని ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన జిల్లాలోని బంగారుపాళ్యం పరిధిలో చోటుచేసుకోగా, ప్రస్తుతం బాధితుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రూ. 3.15 కోట్ల మోసం.. సూసైడ్ నోట్ కలకలం

ఆత్మహత్యాయత్నానికి ముందు లోకేష్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. 

రైల్వే కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికిన హీరో మురళీకృష్ణ  తన దగ్గర నుండి రూ. 3.15 కోట్లు తీసుకున్నాడని. తన వద్ద అంత మొత్తం లేకపోయినా బంధువుల నుండి తీసుకోని మురళీకృష్ణ కి ఇచ్చినటు లోకేష్ లేఖలో పేర్కొన్నాడు.

ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం కోసం తన సొంత ఇంటిని తాకట్టు పెట్టడమే కాకుండా, బంధువుల దగ్గర కూడా అప్పులు చేసినట్లు బాధితుడు వాపోయాడు.

అనారోగ్యం కారణంతో కనీసం ఆసుపత్రి ఖర్చుల కోసం ఒక రూ. 20 లక్షలు ఇవ్వమని వేడుకున్నా, సదరు హీరో ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

న్యాయం కోసం బాధితుడి వేడుకోలు

“అమ్మానాన్న నన్ను క్షమించండి” అంటూ లేఖ ప్రారంభించిన లోకేష్, తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని, మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *