Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం లాంటి రీజినల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడంతోనే ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.అంచనాలు మించి ఉండేలా సినిమాని సిద్ధం చేసేందుకు అనిల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేశారు. డైలాగు వెర్షన్ రాసేందుకు వైజాగ్ కూడా వెళ్ళింది అనిల్ అండ్ టీం. ఈ పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఒకప్పటి శంకర్ దాదా జిందాబాద్ లాంటి సినిమాలో ఉండే వింటేజ్ చిరుని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథగా చెబుతున్నారు.ఈ సినిమా అసలైన వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అని మాట్లాడుకునేలా ఉంటుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా చిరంజీవి క్యారెక్టర్ రాసుకున్న తీరు బాగా వర్కౌట్ అయిందని దానికి తోడు కథ కూడా సెట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఎన్నో సంచలనాలు క్రియేట్ చెయ్యడం పక్కా అట.
