Chiranjeevi

Chiranjeevi: పవన్‌కు ప్రేమతో చిరు: రాజువై వారందర్నీ నడిపించు

Chiranjeevi: ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా అనేక మంది సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమను చాటుకున్నారు.

సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన X (ట్విట్టర్) అకౌంట్ ద్వారా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సినీ రంగం, ప్రజా జీవితం, దాతృత్వంలో మీరు చూపించిన అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని ఆయన కొనియాడారు. చిరంజీవి మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు.

పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం:
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అసాధారణ విజయాలు సాధించిన చిరంజీవి జీవితం తనకు, మరెందరికో స్ఫూర్తి అని పేర్కొన్నారు. కీర్తికి పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా విజయాన్ని వినమ్రతతో, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల చిరంజీవి నుంచే తాను నేర్చుకున్నానని పవన్ చెప్పారు. చిరంజీవిని ‘విశ్వంభరుడు’గా అభివర్ణిస్తూ, “నీకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం” అని పవన్ భావోద్వేగంగా రాశారు.

Also Read: Chiranjeevi Birthday: చిరంజీవి బర్త్‌.. ప్రముఖుల విషెస్

చిరంజీవి హృద్యపూర్వక స్పందన:
పవన్ కల్యాణ్ పంపిన సందేశానికి చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. “ప్రతి మాట, ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది” అని పేర్కొన్నారు. పవన్ సాధించిన విజయాలు, ఆయన పోరాటాన్ని చూసి తాను గర్వపడుతున్నానని తెలిపారు. జన సైనికులను రాజులా నడిపించాలని, వారి కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు. నీ ప్రతి  అడుగులోనూ విజయం మిమ్మల్ని వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి” అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిన్ననాటి పవన్ కల్యాణ్‌తో ఉన్న అరుదైన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.

‘విశ్వంభర’ గ్లింప్స్ విడుదల:
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా బృందం అభిమానులకు ఒక ప్రత్యేక కానుకను అందించింది. ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్‌ను విడుదల చేసింది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. దీనితో పాటు, చిరంజీవి అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల వంటి దర్శకులతో కూడా సినిమాలు ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *