Stalin

Stalin: మెగాస్టార్ స్టాలిన్ రీరిలీజ్!

Stalin: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సందేశాత్మక చిత్రం ‘స్టాలిన్’ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో చిరంజీవి కలిసి చేసిన ఈ సినిమా 2006లో విడుదలై, మాస్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు పొందింది. చిరంజీవి డైనమిక్ పెర్ఫార్మెన్స్, మణిశర్మ సంగీతం కలిసి ‘స్టాలిన్’ని అభిమానుల హృదయాల్లో నిలిపాయి. అప్పట్లో సామాన్యంగా ఆడినప్పటికీ, ఈ చిత్రానికి అభిమానులతో పాటు న్యూట్రల్ ఆడియెన్స్‌లోనూ బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ‘స్టాలిన్’ రీ-రిలీజ్‌కు సన్నాహాలు ఊపందుకున్నాయి. పాత ప్రింట్‌ను రీమాస్టర్ చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్‌లో ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, చిరంజీవి అభిమానులు ఆగస్ట్‌లో మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అయితే ఇంకా గ్రాండ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ రీ-రిలీజ్‌పై భారీ హైప్ నెలకొంది. ‘స్టాలిన్’ ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *