JVAS

JVAS: జగదేక వీరుడు అతిలోక సుందరి.. చిరు, శ్రీదేవిల రెమ్యూనరేషన్ ఎంతంటే?

JVAS: జగదేక వీరుడు అతిలోక సుందరి టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి. 1990లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సోషియో-ఫాంటసీ చిత్రం. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే రాశారు. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ 2 కోట్ల రూపాయలు. బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు సంపాదించి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవిల నటన టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే, ఈ సినిమాకు చిరంజీవి, శ్రీదేవి ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా ఉంది.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, చిరంజీవికి రూ. 25 లక్షలు, శ్రీదేవి రూ. 20 లక్షలు తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ ఇండస్ట్రీలో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్నందున పారితోషికం విషయంలో రాజీ పడేది లేదని నిర్మాత అశ్విని దత్ అన్నారు. ఈ క్లాసిక్ చిత్రాన్ని మేకర్స్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న తిరిగి విడుదల చేస్తున్నారు. ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరిగి విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని 4K , 3D ఫార్మాట్లలో తిరిగి విడుదల చేయడం గమనార్హం. దీని కోసం నిర్మాతలు రూ.8 కోట్లు ఖర్చు చేశారు. కాగా జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9, 1990న విడుదలైంది. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా విడుదలైనప్పుడు ఉన్న క్రేజ్ చెప్పాలంటే మొదటి మ్యాట్నీ షో కోసం రూ.6 ధర ఉన్న టిక్కెట్లు రూ.100కి అమ్ముడయ్యాయి. బ్లాక్ టికెట్ రూపంలో రూ.100. 210 వరకు అమ్మారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎన్నేళ్లు పడుతుందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *