Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి దెబ్బతో ఎరుపెక్కిన సోషల్ మీడియా!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఫిల్మ్ అప్ డేట్ అదిరిపోయింది. నేచురల్ స్టార్ నానీ సమర్పణలో ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా X లో నానీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల బ్లర్ గా కనిపిస్తుంటే.. వారిద్దరూ చేతులు కలుపుకుని ఉన్న ఇమేజ్ అది. అయితే, వారి చేతులు ఎర్రటి రక్తం ఓడుతున్నట్టు ఫుల్ క్లారిటీతో ఫోర్ గ్రౌండ్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ని షేక్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నానీ తన ట్వీట్ లో ఇచ్చిన కామెంట్ కూడా ఆకట్టుకునేలా ఉంది. “ఇట్ ఈజ్ ఏ బ్లడ్ ప్రామిస్” అంటూ నాని పెట్టిన కామెంట్ కూడా సినిమా మీద మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. మొత్తంగా చూసుకుంటే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నేచురల్ స్టార్ నాని ఎదో అద్భుతం సృష్టించేలా ఉన్నాడని అభిమానులు అనుకుంటున్నారు.

Chiranjeevi: ఇదిలా ఉంటె మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన లైనప్ తో రాబోతున్నారు. ప్రస్తుతం మల్లిడి వశిష్టతో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ లో నటిస్తున్న చిరంజీవి ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా కమిట్ అయ్యాడు. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండటం విశేషం. ‘హింసలోనే శాంతిని వెతుక్కుంటాడు’ అనే క్యాప్షన్ తో రానుండటమే ఇది ఎంత వయొలెంట్ మూవీనో తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా కంటే ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఇది పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ మూవీ.

Chiranjeevi: అంటే ఓ ఫాంటసీ సినిమా తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ డ్రామా చిత్రం చేయబోతున్నాడన్న మాట. ఇక చిరుతో సినిమాను తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేస్తూ ‘ఫ్యాన్ బాయ్ తాండవం’ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించాడు శ్రీకాంత్ ఓదెల. రక్తం ఓడుతున్న చేతిని ట్విటర్ లో శ్రీకాంత్ పోస్ట్ చేయగానే మెగా ఫ్యాన్స్ దానిని తెగ వైరల్ చేసేస్తున్నారు. మరి రాబోయే మూడు చిత్రాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Brahma Anandam OTT: స్ట్రీమింగ్ కి వచ్చేసిన 'బ్రహ్మ ఆనందం'!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *