Chiranjeevi:

Chiranjeevi: రాజ్య‌స‌భ‌కు మెగాస్టార్ చిరంజీవి!

Chiranjeevi: మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి ఎంపీ కానున్నారు. ఈ విష‌యం కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతానికి చిరంజీవి ఏ పార్టీలో చేరాల‌నే యోచ‌న లేకున్నా, ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తుగానే ఉంటూ వ‌స్తున్నారు. ఈ ద‌శ‌లో జ‌న‌సేనతో పొత్తులో ఉన్న బీజేపీ చిరంజీవి సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని చూస్తున్నది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను రాజ్య‌స‌భకు పంపాల‌ని యోచిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Chiranjeevi: ప్ర‌స్తుతం రాజ్య‌స‌భలో 4 స్థానాలు రాష్ట్ర‌ప‌తి కోటాలో ఖాళీగా ఉన్నాయి. గ‌త జూలై 14న ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని వ‌చ్చే జ‌న‌వ‌రి 14లోపు భ‌ర్తీ చేయాల్సి ఉన్న‌ది. ఈ నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ద‌క్షిణాదిలో ఒక సినీ ప్ర‌ముఖుడిగా గుర్తిస్తూ ఆయ‌న‌కు ఈ గౌర‌వం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం చూస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Health Tips: ఇంటి భోజనం అయినా సరే ఈ జాగ్రత్తలు పాటించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *