Chiranjeevi: డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిద్దాం.. డ్రగ్స్ లేని తెలంగాణను నిర్మిద్దాం.. అని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని టీవర్క్స్ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి వర్చువల్ సందేశం పంపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయిచేయి కలిపి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
Chiranjeevi: వ్యసనాలకు బానిసలై ఎందరో తమ కలలను సాధించుకోలేక వ్యధ చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మాధకద్రవ్యాల కట్టడిపై ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలిస్తేనే యువత తమ కలలను నెరవేర్చుకోగలుగుతుందని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఎందరో సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అందరం పోరాటమే చేయాలని కోరారు.