Kodama Simham: 1990.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మెమరబుల్ ఇయర్.. కొండవీటి దొంగ, జగదేక వీరుడు-అతిలోక సుందరి, కొదమ సింహం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేశారు చిరు. అప్పట్లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన కె.మురళీ మోహన్ రావు డైరెక్షన్లో.. చిరు చేసిన కౌబోయ్ ఫిల్మ్.. కొదమ సింహం నేటితో 35 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.
Also Read: Prabhas’ Fauji: ప్రభాస్ ఫౌజీ విడుదల ఎప్పుడంటే?
సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ ఈ సినిమాకి సమర్పణ.. కె.నాగేశ్వర రావు నిర్మాత.. సోనమ్, వాణీ విశ్వనాథ్, రాధ ఫీమేల్ లీడ్స్.. కౌబోయ్ కథకి, ట్రెజర్ హంట్ థీమ్ యాడ్ చెయ్యడంతో బడ్జెట్ ఎక్కువైనా డేర్ చేసి తీశారు నిర్మాత.. రాజ్-కోటి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, చిరు యాక్షన్, ఫైట్స్, డ్యాన్సులు నెక్స్ట్ లెవల్ అసలు.. నైజాంలో ఫస్ట్ టైం 44 థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ఇదే. 16 కేంద్రాల్లో 50 రోజులు, 4 కేంద్రాల్లో 100 రోజులాడింది. ‘హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్’ పేరుతో ఇంగ్లీష్ లోకి డబ్ అయింది కూడా.. ఇప్పటికీ చిరంజీవి నటించిన టాప్ 10 సినిమాల్లో ‘కొదమ సింహం’ది స్పెషల్ ప్లేస్..