Chiranjeevi: తెలుగు చిత్రసీమంలో ఇప్పుడు “మన శంకర వరప్రసాద్‌గారూ” మేనియా నడుస్తుంది. సంక్రాంతి విజేతగా ఈ సినిమా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి హీరో కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇదే సినిమాలో మరో అగ్రహీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో నటించడం అదనపు హంగు వచ్చింది. మలి దశలో చిరంజీవికి రికార్డులపై రికార్డులు ఈ సినిమాతో దక్కడంతో ఆయన మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి ఓ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.
Chiranjeevi: రూ.300 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఉరకలు వేస్తున్న “మన శంకర వరప్రసాద్‌గారూష సినిమా ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ నిలిచింది. ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద భారీ సంచలన విజయాన్ని అందుకొని ఇంకా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటున్నది. కుటుంబ సమేతంగా చూసే సినిమాగా, నవ్వులు పండించే అరుదైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్నది.
Chiranjeevi: ఈ భారీ విజయాన్ని పురస్కరించుకొని సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో చిరంజీవి అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ అనిల్ రావిపూడికి ఓ గిఫ్ట్‌ను ప్రకటించారు. వెంటనే ఆ కానుకను రప్పించడంతో కరతాళ ధ్వనుతలతో ఆ ప్రాంతం మారుమోగింది. బ్రాండ్ న్యూ రేంజ్‌రోవర్ స్పోర్ట్స్ కారును మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడికి కానుకగా బహూకరించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మురిసిపోయారు.
