Mega 157

Mega 157: సౌండ్ ఇంకా గట్టిగా రావాలి . . రప్ఫాడించేద్దాం.. చిరు – అనిల్ రావిపూడి ప్రమోషన్స్ స్టార్ట్ !

Mega 157: ఉగాది కానుకగా అనౌన్స్ అయిన ‘మెగా 157’ చిత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సినిమాతో చిరుతో జతకట్టడంతో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ముహూర్త కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన ఈ చిత్రం కోసం అనీల్ రావిపూడి తన స్టైల్‌లో ప్రమోషన్స్‌ను ఘనంగా ఆరంభించారు.టాలీవుడ్‌లో అనీల్ రావిపూడి మార్కెటింగ్ స్ట్రాటజీ అంటేనే ఆడియెన్స్‌కు సూపర్ హిట్ అని చెప్పాలి. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ చేసిన ప్రమోషన్స్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇప్పుడు అదే ఊపుతో చిరంజీవి సినిమా కోసం ఓ క్రేజీ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Akhanda 2: అఖండ 2: బాలీవుడ్ ‘డర్టీ’ బ్యూటీ నటిస్తుందా?

ఈ వీడియోలో చిరు ఐకానిక్ రోల్స్‌తో పాటు సినిమా మెయిన్ టీమ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీని అందించారు.ఈ వీడియోలో మెగాస్టార్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ అభిమానులను ఉర్రూతలూగించాయి. చివర్లో అనీల్‌తో ‘ఇది చాలదు.. ఇంకా రఫ్ఫాడించాలి’ అంటూ చిరు చేసిన కామెడీ పంచ్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ‘మెగా 157’తో చిరు-అనీల్ కాంబో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *