Anil Ravipudi

Anil Ravipudi: కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు.. మెగా హగ్ వైరల్

Anil Ravipudi: అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ తో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈరోజు ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లిన అనిల్ రావిపూడి, చిరంజీవిని హగ్ చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోని తన ట్విట్టర్ (X)లో పోస్ట్ చేసిన దర్శకుడు “కొన్ని సందర్భాల్లో మాటలు అవసరం లేదు” అనే ట్యాగ్ జోడించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నిన్న జనవరి 11 రాత్రి పడిన ప్రీమియర్స్ నుండే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీస్ అందరూ థియేటర్ కి వచ్చి చిరంజీవిపై తమకు ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు. సినిమా గురించి చెప్పాలంటే ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే వర్డ్ కూడా తక్కువే. తన స్వాగ్, కామెడీ టైమింగ్, ఫైటింగ్ లో తన స్టైల్.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం చిరంజీవి ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా ఫ్యామిలీస్ కి ఒక పండుగలాంటి సినిమా అనొచ్చు.

అనిల్ రావిపూడి తన విజయాలను కొనసాగిస్తూ తన కథలో ఇంకో సినిమా వేసుకున్నాడు. సినిమా ఫుల్ రన్ లో ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *