Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారంటూ ఈ ఉదయం నుంచి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజాగా చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తన తల్లి ఆరోగ్యం విషయంలో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. “మా అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కొన్ని మీడియా కథనాలు చూశాను. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నిజానికి, అమ్మకు రెండు రోజులుగా స్వల్ప అస్వస్థత మాత్రమే. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో, ఎంతో హుషారుగా ఉన్నారు. అందుకే, మీడియా సంస్థలను నా మనవి – దయచేసి ఊహాగానాలకు తావివ్వకండి. తప్పకుండా ఆ సమాచారం నిజమైతే, మేమే అధికారికంగా తెలియజేస్తాం. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు.ఈ ప్రకటనతో అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న అనవసర ఊహాగానాలకు తెరపడినట్లయింది.