Chinta Mohan

Chinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!

Chinta Mohan: తిరుపతి లడ్డూ వ్యవహారంలో ప్రముఖులు అంతా వైఎస్ జగన్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో చింతామోహన్ మాట్లాడారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు. సీఎం చంద్రబాబు నెయ్యి అంశాన్ని ఇంతటితో విడిచిపెట్టాలని ఆయన చెప్పారు.  దేశమంతా ప్రస్తుతం చంద్రబాబు వైపు చూస్తోంది. ఆయన ఇప్పుడు దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్నారని చింతామోహన్ అన్నారు. ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబుకు  చిన్నపాటి లీడర్ అయిన జగన్‌కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Chinta Mohan: ఇక సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన గుండెల్లో నీరు చేరింది. చిన్నపాటి చికిత్సతో దానిని సరి చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు. కానీ, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయనకు సరైన చికిత్స అందించలేదు అని చెప్పారు.  సీతారాం ఏచూరి మృతి వెనుక  బీజేపీ రాజకీయ కుట్ర కోణం దాగుందని మాజీ మంత్రి ఆరోపించారు.   దీనిపై విచారణ చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Also Read: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనిత 

Chinta Mohan: కాగా ,  తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది .  తమ తప్పు ఏమీ లేదని ,  ఏపీ సీఎం తమ మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చెబుతూ వస్తున్నారు .  ఈ క్రమంలో ఆయన ఈరోజు అంటే సెప్టెంబర్ 28న తిరుమల వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు .  కానీ ,  కొన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు .  ఇప్పుడు జగన్ తిరుపతి పర్యటన రద్దుపై కూడా ఏపీలో రాజకీయంగా పెద్ద రచ్చ నడుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *