Avika: ప్రముఖ నటి అవికా గోర్, ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ఇంటింటా సుపరిచితమైన అందాల తార, తన జీవితంలో సరికొత్త మలుపు తీసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, సామాజిక కార్యకర్త మిలింద్ చాంద్వానీతో ఆమె నిశ్చితార్థం జరుపుకుంది. ఈ శుభవార్తను జూన్ 11న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న అవికా, హృదయాన్ని తడమగల ఓ పోస్ట్‌తో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. వీరిద్దరి ప్రేమకథ గత కొన్నేళ్లుగా నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. నిశ్చితార్థ ఫొటోల్లో అవికా, మిలింద్‌తో కలిసి సంతోషంగా నవ్వుతూ, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కనిపించారు. మరో ఫొటోలో మిలింద్‌కు ముద్దిస్తూ ఆమె మునిగిపోయిన క్షణాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఈ జంట ఫొటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ కొత్త జోడీకి శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ‘చిన్నారి పెళ్లికూతురు’గా మనసు గెలిచిన అవికా, ఇప్పుడు నిజజీవితంలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. త్వరలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

