China: పాకిస్తాన్ దేశంలో 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడిపై చైనా దేశం స్పందించింది. ఈ రెండు దేశాలకు సరిహద్దులో ఉన్న దేశం కావడంతోపాటు, ఒకింత పాకిస్తాన్ చర్యలకు ఊతమిచ్చే చైనా స్పందనపై భారత్ సహా ప్రపంచ దేశాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి. వివిధ ప్రపంచ దేశాధినేతలు ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తున్న వేళ చైనా కూడా ఇరు దేశాలకు శాంతి సందేశం పంపింది.
China: పహిల్గామ్ అనంతరం తాజా పరిణామాలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధాలు కలిగిన పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతపై ఆ దేశం స్పందించింది. పాకిస్తాన్ సన్నిహిత మిత్రదేశమైన చైనా ఈ కీలక ప్రకటన చేసింది. చైనా దేశం ఇటు భారత్, అటు పాక్‌తో సరిహద్దులను పంచుకుంటున్నది.
China: ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్, పాక్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ దాయాది దేశాలు సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి చేసింది. భారత్, పాకిస్తాన్ రెండూ దాయాది దేశాలు. ఆ రెండు కూడా మాకు పొరుగు దేశాలు.. అయినా చైనా అన్నిరకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది.. అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
China: ఇరుదేశాలు శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని చైనా కోరుకున్నది. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆ దేశం భారత్, పాకిస్తాన్‌కు విజ్క్షప్తి చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్పందనను భారత్ సహా ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

