China: ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అన్ని దేశాలకు పోటీనిస్తున్నది చైనా దేశం. చాలా విషయాల్లో అమెరికానే బీట్ చేస్తూ వస్తున్నది. ఇప్పటికీ అమెరికాకు ప్రధాన పోటీదారుగా మారిందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మిలటరీ రంగంలోనూ అమెరికాను మించి తన ఉనికిని చాటుకుంటున్నది. ఈ దశలోనే అమెరికా రక్షణ శాఖను మించిన సదుపాయాలతో చైనా తన రక్షణ కేంద్రాన్ని నిర్మించుకుంటుందని వార్తలొచ్చాయి.
China: ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కమాండ్ కేంద్రాన్ని ఇప్పుడు చైనా నిర్మిస్తున్నది. రాజధాని నగరమైన బీజింగ్‌కు సమీపంలో బీజింగ్ మిలిటరీ సిటీ పేరిట ఈ నిర్మాణం కొనసాగుతున్నది. ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ కంటే 10 రెట్లు పెద్దదని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొనడం విశేషం. సుమారు 1500 ఎకరాల్లో దాని నిర్మాణాలు జరుగుతున్నట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసినట్టు ఆ పత్రిక వెల్లడించింది.
China: బీజింగ్ మిలిటరీ సిటీ నిర్మాణ పనులను 2024 సంవత్సరం మధ్యలో ప్రారంభించినట్టు తెలిసింది. ఆసిటీలో అణ్వాయుధ దాడిని కూడా తట్టుకునేలా అక్కడ భూగర్భ నిర్మాణాలు, సొరంగాలు కూడా ఉన్నట్టు ఆ ఆంగ్ల పత్రిక ద్వారా తెలిసింది. ఆయుధ సంరక్షణకు సరైన భవనాలు కూడా నిర్మాణం చేపట్టినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిసింది.
China: 2027లో చైనా మిలిటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది వేడుకలు జరుగుతాయి. ఆ నాటికి ఈ బీజింగ్ మిలిటరీ సిటీ నిర్మాణ పనులను పూర్తి చేయాలనే యోచనలో చైనా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తన్నది. ఆ ఏట నుంచి ఈ సిటీ నుంచి చైనా ఆధునీకరించిన మిలటరీని వినియోగిస్తుందని సమాచారం.