Sircilla: పట్టువస్త్రంపై ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ముద్రించి శభాష్ అనిపించుకున్నాడు ఓ తెలంగాణ చేనేత కళాకారుడు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కళాకారుడు హరిప్రసాద్.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అభిమానం ఉన్నది. ఈ అభిమానంతో పట్టువస్త్రంపై ముఖ్యమంత్రి చిత్రం వచ్చేలా నేశాడు. దాదాపు ఐదు రోజులపాటు శ్రమించిన హరిప్రసాద్ దీనిని తయారు చేసి అందరినీ అబ్బురపర్చాడు.
ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఆయనపై అభిమానంతో దీనిని రూపొందించానని కళాకారుడు హరిప్రసాద్ చెప్పి ఆనందం వ్యక్తం చేశారు.

