Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ వంటి శస్త్రాయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర కీలకమైన మావో పత్రాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం కూడ ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు ఇంకా రావలసి ఉంది.
ఈ ఆపరేషన్‌లో మృతిచెందిన మావోయిస్టుల గుర్తింపుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వన ప్రాంతాల్లో మావోయిస్టు చొరబాట్లను అణిచివేయడానికి భద్రతా దళాలు సుదీర్ఘంగా ప్రత్యేక ఆపరేషన్‌లు చేపడుతున్నాయి.