chennamaneni ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు మరో భారీ షాక్ తగిలింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం బుధవారం ఆది శ్రీనివాస్‌ను విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు పిలిపించారు.
ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షల చెల్లింపు
ఇక మరోవైపు, చెన్నమనేని రమేష్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు అందజేశారు. ఈ మొత్తాన్ని గత 15 ఏళ్లుగా కొనసాగిన న్యాయపోరాట వ్యయాలకు పరిహారంగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
జర్మన్ పౌరసత్వం కలిగిన చెన్నమనేని రమేష్ తన అఫిడవిట్‌లో తప్పు సమాచారం ఇచ్చారని, అందువల్ల ఆయన ఎమ్మెల్యే పదవి చెల్లదని 2024 డిసెంబర్ 9న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
దాదాపు దశాబ్దకాలంగా ఆది శ్రీనివాస్ చెన్నమనేని పౌరసత్వంపై న్యాయపోరాటం కొనసాగించగా, చివరికి విజయాన్ని అందుకున్నారు. ఈ న్యాయయుద్ధానికి ఇది ముగింపు వలె మారింది.