Chennai: చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు.. వేలచేరి పరిసరాల్లో ఉన్నవారు తమ కార్లను ఫ్లైఓవర్లపై పార్క్ చేశారు. దీంతో అలా పార్క్ చేసిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. అక్కడ ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.. అందుకే తమ వాహనాలను కాపాడుకునేందుకు ఫ్లై ఓవర్లపై పార్క్ చేస్తున్న వాహనదారులు.
