Goods Train Fire Accident: తమిళనాడులోని చెన్నై సమీపంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు వద్ద ఇంధనంతో నిండిన గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలు రైలులోని ఐదు బోగీలకి వ్యాపించాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. చమురు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మంటల తీవ్రతను చూస్తే ఈ ప్రమాదం చాలా పెద్దదిగా ఉందని అర్థమవుతోంది.
అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాదాపు 10 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఎగసిపడటంతో అదుపు చేయడం సులభంగా లేకపోయినప్పటికీ సిబ్బంది తమవంతుగా ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Brahmanandam Emotional: అరేయ్ కోట.. ఏడుపొస్తుంది.. బోరున ఏడ్చేసిన బ్రహ్మానందం
పలు రైళ్లు నిలిపివేత, ప్రయాణికులకు ఇబ్బందులు
ఈ ప్రమాదం కారణంగా అరక్కోణం మీదుగా వెళ్లే సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. అలాగే ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును, 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్దిని కూడా నిలిపివేశారు. చెన్నై సెంట్రల్ నుంచి కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ తాత్కాలికంగా ఆపేశారు.
దీంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ ఎప్పుడు రైళ్లు పునఃప్రారంభమవుతాయన్న విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం సంఘటనా స్థలంలో మంటలు తగ్గుతున్నా పూర్తిగా అదుపులోకి రాలేదు. మిగతా వ్యాగన్లకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు అధికారులు త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం
ఆయిల్ తరలిస్తున్న ట్యాంకర్ రైలులో ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ఓడరేవు నుండి ఆయిల్ తరలిస్తున్న రైలు తిరువళ్లూరు పట్టణ సమీపంలో అగ్నిప్రమాదానికి గురవ్వడంతో, 5 బోగీలకు వ్యాపించిన మంటలు
భారీగా ఎగసిపడుతున్న మంటలను… pic.twitter.com/ZIqDBmDNPW
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2025