Chennai: దిత్వా తుఫాన్ ప్రభావంతో Chennai సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి రవాణా తీవ్రంగా నిలిచిపోయింది. ముఖ్యంగా సబ్‌వేల్లో నీరు నిల్వ ఉండటంతో వాటిని తాత్కాలికంగా మూసివేశారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని Thiruvallur, Kanchipuram, అలాగే Chengalpattu జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి M. K. Stalin సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు

