Jackfruit : పనసపండు అంటేనే చాలామందికి నోరూరుతుంది. కానీ ఇది కేవలం రుచికోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీజనల్ ఫలంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. పోషకాలు అధికంగా ఉండే పనసను మాంసానికి మంచి ప్రత్యామ్నాయంగా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి మనలను రక్షించడంలో సహాయపడతాయి.
పనస పండులో విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
Jackfruit : పనసలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండటంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇవి కలిసి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. మితంగా పనస పండు తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రించవచ్చు.
పనసపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంలో ఉంచుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కూడా అనుకూలంగా పనిచేస్తుంది. మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
Also Read: Cinnamon Water Benefits: దాల్చిన చెక్క నీటితో బోలెడు ప్రయోజనాలు
Jackfruit : ఈ పండులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పనసను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.
పనసలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నివారించడంలో సహాయపడతాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. దీర్ఘకాలంగా పనసను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.