ISRO Scientist Salary 2024: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిస్సందేహంగా భారతదేశానికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇస్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు.. తమ విజయాలతో ప్రపంచ స్థాయిలో దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్తల జీతం ఎంత, నెలకు ఎంత సంపాదించవచ్చన్న అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. మీకు కూడా ఈ తెలుసుకోవాలి అని ఉందా? ఫ్రెషర్స్ నుండి టాప్ నిపుణుల వరకు, ఇస్రో శాస్త్రవేత్తల నెలవారీ జీతం ఇక్కడ తెలుసుకుందాం.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో సహా అనేక విజయాల కారణంగా ఇస్రో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పాత్ర ఉంది. ఇస్రో విజయగాథ, శాస్త్రవేత్తల వ్యూహం చూసి చాలా మంది యువకులు గర్వించే ఈ సంస్థలో పనిచేయాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఇస్రోలో పనిచేస్తున్న సైంటిస్టులు, ఇంజనీర్ల జీతంపై కూడా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత సంపాదిస్తారు, ఫ్రెషర్స్ నుండి టాప్ ఎక్స్‌పర్ట్స్ వరకు ఇస్రో శాస్త్రవేత్తల నెలవారీ జీతం ఎంత అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Formula e car Race: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా? ఆ కేసులో ఏ1 ఆయనే!
ఇస్రో శాస్త్రవేత్తల నెలవారీ జీతం ఎంత?
7వ వేతన సంఘం ప్రకారం ఇస్రో శాస్త్రవేత్తల స్టార్టింగ్ రూ.56,100. తో మొదలవుతుంది ఇక్కడ శాస్త్రవేత్తలు వారి పోస్ట్ ప్రకారం వివిధ మార్గాల్లో చెల్లించబడతారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రాథమిక జీతంతో పాటు టుట్టీ అలవెన్స్ (డిఎ), ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) ప్రయాణ అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఇస్రో సైంటిస్ట్ పే స్ట్రక్చర్:
- ప్రాథమిక వేతనం- రూ. 56,100
- డియర్నెస్ అలవెన్స్– రూ. 6732
- ఇంటి అద్దె అలవెన్స్ – రూ. 13464
- రవాణా భత్యం – రూ. 7200
- ISRO శాస్త్రవేత్తల మొత్తం జీతం – రూ. 84360
ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ నెలకు రూ. 44,900 నుండి రూ. 1,42,400 వరకు సంపాదించవొచ్చు,
బి గ్రేడ్ టెక్నీషియన్ రూ. 21,000 నుండి రూ. 69,100, సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్సీ) రూ. 56,100 – రూ. 1,77,500, సైంటిస్ట్/ఇంజనీర్ రూ.67,700 – 2,08,700. వరకు జీతం చెల్లిస్తారు సైంటిస్ట్/ఇంజనీర్‌గా ఎంపికైన ఫ్రెషర్‌లకు నెలకు 56,100. జీతం చెల్లిస్తారు. వారి అనుభవం ప్రమోషన్ ఆధారంగా జీతం పెరుగుతుంది.
ఇస్రోలో సైంటిస్ట్ కావడానికి కావాల్సిన అర్హత:
ఇస్రోలో శాస్త్రవేత్త కావాలనుకునేవారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో కనీసం 60% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, నాలుగేళ్ల బీటెక్, పీహెచ్‌డీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఆస్ట్రానమీ, ఫిజిక్స్ ,మ్యాథమెటికల్ సబ్జెక్టులతో సహా మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఇస్రోలో సైంటిస్ట్ కావడానికి అర్హులు.