cheating:

cheating: ఐఏఎస్ కావాల‌ని క‌ల‌లు క‌న్న‌ది.. కాక‌ముందే అన్నంత ప‌నిచేసింది!

cheating: అంద‌రూ క‌ల‌లుగంటారు.. ఆ క‌ల‌ను నిజం చేసుకునేది కొందరే.. కానీ ఓ యువ‌తి త‌న క‌ల‌ సాకారం కాలేద‌ని చేసిన నిర్వాకం అంద‌రినీ నివ్వెర‌ప‌రిచింది. ఏకంగా త‌నే క‌లెక్ట‌ర్‌ను అంటూ ఓ క‌లెక్ట‌రేట్‌కు వెళ్లి క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో అవాక్కైన ఆ కార్యాలయ అధికారులు వాక‌బు చేస్తే న‌కిలీ అని తేలింది. కొంద‌రు పాపం అని స‌రిపెట్టుకున్నారు. పోలీసులు కూడా లైట్ తీసుకొని వ‌దిలేశారు. ఇంత‌కూ ఆమె చేసిన ప‌ని ఏమిటి? ఎందుకు చేసింది? ఎలా చేసింది? అన్న విష‌యాలు తెలుసుకుందాం రండి.

cheating: కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ఆశిశ్ సాంగ్వాన్ న‌వంబ‌ర్ 2 నుంచి సెలువులో వెళ్లారు. దీంతో నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను అప్పగించారు. అదే కామారెడ్డి క‌లెక్ట‌రేట్‌కు తనను ప్ర‌భుత్వం ఇన్‌చార్జి క‌లెక్ట‌ర్‌గా నియ‌మించింద‌ని వ‌చ్చిన‌ హైద‌రాబాద్ జీడిమెట్ల‌కు చెందిన‌ ఇస్ర‌త్ జ‌హాన్ అనే మ‌హిళ‌.. ఏకంగా ఉత్త‌ర్వుల కాపీనే చూపించింది.

cheating: అదే ఉత్త‌ర్వుల కాపీని తీసుకున్న క‌లెక్ట‌రేట్ అధికారులు.. దానిని ప్ర‌భుత్వానికి పంపించామ‌ని, పైనుంచి ఆదేశాలు వ‌చ్చాక నిర్ణ‌యం చెప్తామ‌ని అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆమెకు చెప్పారు. దీంతో ఇస్ర‌త్ జ‌హాన్ అక్క‌డే ఉన్న చాంబ‌ర్‌లో కాసేపు కూర్చొని ఉన్న‌ది. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. అనుమానంతో క‌లెక్ట‌రేట్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

cheating: సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వ‌ద్ద ఆ మ‌హిళ‌ను పోలీసులు నిలిపి విచారించారు. న‌కిలీ అని తేల‌డంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 2020 నుంచి గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతుంద‌ని, ఉద్యోగం వ‌చ్చింద‌ని కుటుంబ స‌భ్యుల‌ను న‌మ్మించేందుకే ఈ ప్ర‌య‌త్నం చేసింద‌ని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ మ‌హిళ చీటింగ్ కేసు పెట్టి ఆమెకు కౌన్సెలింగ్ చేసిన పోలీసులు వ‌దిలేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *