ChatGpt Down: OpenAI ప్రసిద్ధ AI చాట్‌బాట్ ChatGPT ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం అకస్మాత్తుగా పని చేయడం మానేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు దీనిని ఉపయోగించడంలో భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు OpenAI సేవలతో సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం, 1,400 కంటే ఎక్కువ మంది వినియోగదారులు చాట్‌బాట్‌లో లోపాలను కంప్లైంట్ చేశారు.
ఈరోజు అంటే గురువారం, 6 ఫిబ్రవరి 2025న, ఉదయం 10 గంటల ప్రాంతంలో, ChatGPT అన్ని సేవలు నిలిచిపోయాయి. దీనిలో 98% కంటే ఎక్కువ మంది వినియోగదారులు ChatGPT సేవలో సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో దాని గురించి ఫిర్యాదు చేస్తున్నారు.
ChatGPT సేవ నిలిచిపోయిన వెంటనే, వినియోగదారులు సమస్యను నిర్ధారించడానికి X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీనిపై చాలా మంది వినియోగదారులు తమ కామెంట్స్ ఇస్తున్నారు.
I actually love twitter because anytime I think it’s just me, I come here and
find out that everyone is thinking the exact same way. So I can confirm the ChatGPT is down.— Sureya Sultan (@sureyahsultan) February 6, 2025
“నాకు ట్విట్టర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడల్లా.. ఇక్కడకు వచ్చి చూస్తే మిగతా అందరూ సరిగ్గా నాలానే ఆలోచిస్తున్నారని తెలుసుకుంటాను” అని ఒక వినియోగదారు Xలో రాశారు. అందుకే ChatGPT పనిచేయడం లేదని నేను నిర్ధారించగలను. అంటూ అతను పేర్కొన్నారు. మరొక వినియోగదారు సరదాగా ఇలా వ్రాశాడు, ‘ChatGPT డౌన్ అయినప్పుడల్లా, నేను ట్విట్టర్‌కి వెళ్లి ‘ChatGPT down’ కోసం శోధిస్తాను, నా అనుభవాన్ని ధృవీకరించే ట్వీట్‌ల వరదను ఎల్లప్పుడూ చూస్తాను.’ ట్విట్టర్ నిజంగా చాలా బాగుంది.
ఇలా వినియోగదారుల నుంచి స్పందనలు రావడం కొత్తగా జరిగేదేమీ కాదు. ఒక ప్రధాన ఆన్‌లైన్ సేవ నిలిచిపోయిన ప్రతిసారీ, ఇతరులు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారా అని చూడటానికి ప్రజలు సోషల్ మీడియాకు వెళతారు. (మన దేశంలో గతంలో కరెంట్ పోయినప్పుడు పక్కింటికి వెళ్లి కరెంట్ ఉందో లేదో తెలుసుకునేవారు) ఇది దాదాపుగా ఇలాంటి ఇబ్బందులను ట్రాక్ చేయడానికి అనధికారిక మార్గంగా మారింది.