Hyderabad:హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల నుంచి బయలుదేరి వెళ్లే రెండు ప్రధాన రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై రోజూ సికింద్రాబాద్ నుంచి రాత్రి 10:05 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి-తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి వెళ్తుందని పేర్కొన్నారు.
