Andhra King

Andhra King: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఆంధ్ర కింగ్’: ఒకరోజు ముందుగానే విడుదల

Andhra King: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమా రిలీజ్ తేదీలో మార్పు వచ్చింది. నవంబర్ 28కు బదులుగా 27న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది.

Also Read: Vijay Deverakonda: ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ!

ఎనర్జిటిక్ స్టార్‌గా పేరొందిన రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ లాంటి క్లీన్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పీ దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి ఆదరణ లభించింది. ప్రమోషనల్ మెటీరియల్‌కు సానుకూల స్పందన వస్తోంది. అందుకే ముందుగా నిర్ణయించిన రిలీజ్ తేదీని వాయిదా వేసి నవంబర్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.సినిమాను ఒకరోజు ముందుగా, అంటే నవంబర్ 27న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఇతర సినిమాలు రిలీజ్ కానందున సోలో రిలీజ్‌గా నిలుస్తుంది. ఒకరోజు ముందు రిలీజ్ చేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రామ్ కెరీర్‌లో కీలకమవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *