Chandrababu

Chandrababu: జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపులపై సీఎం చంద్రబాబు హర్షం

Chandrababu: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ (GST) సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్‌) ద్వారా స్పందిస్తూ, ఈ సంస్కరణలను చరిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు.

నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రజల జీవితానికి నేరుగా సంబంధించిన కీలక రంగాల్లో జీఎస్టీ శ్లాబ్‌లను తగ్గించడం ఒక గొప్ప ముందడుగు అని చంద్రబాబు అభివర్ణించారు. ఈ నిర్ణయం పేదల సంక్షేమానికి తోడ్పడటమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.

ఇది కూడా చదవండి: Tube Master: టీచర్ అంటే ఎలా ఉండాలో చూపిన లెక్కల మాస్టర్.. 20 ఏళ్లుగా స్కూల్‌కి వెళ్లేందుకు నదిలో ఈత

ప్రధానికి, ఆర్థిక మంత్రికి అభినందనలు
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సంస్కరణలు రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లాభసాటిగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం దేశ పురోగతికి దోహదం చేస్తుందని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవం వేదికగా ప్రధాని మోదీ ప్రకటించిన ‘నవతరం జీఎస్టీ సంస్కరణలు’లో భాగంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయని చంద్రబాబు గుర్తుచేశారు. పన్నుల విధానంలో ఇది వ్యూహాత్మక ముందడుగు అని ఆయన ప్రశంసించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ సంస్కరణల అసలు ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa vamsi: ర్యాంకుల స్కాం.. సీబీఐకి దొరికిపోయిన KL యాజమాన్యం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *