Super 6 Super Hit Public Meeting: ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కూటమి పార్టీల నేతలు “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” సభలో పాల్గొన్నారు. ఈ సభలో వారు ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు, రాబోయే నాలుగేళ్లలో సాధించబోయే లక్ష్యాలను కూడా తెలియజేయనున్నారు. ఇప్పటికే ప్రజలకు చేరిన సంక్షేమం, అభివృద్ధి ఫలితాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించనున్నారు.
