Chandrababu Naidu:

Chandrababu Naidu: సుప్రీంకోర్టులో చంద్ర‌బాబుకు ఊర‌ట‌

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో బెయిల్ ర‌ద్దు చేయాల‌ని గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం దాఖలు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గి చార్జీషీటును ఫైల్ చేశారు.

Chandrababu Naidu: 2023 న‌వంబ‌ర్ నెల‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ చంద్ర‌బాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేర‌కు గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం దాఖలు చేసిన పిటిష‌న్‌ బుధ‌వారం విచార‌ణ‌కొచ్చింది. ఈ కేసు పిటిష‌న్‌ను జ‌స్టిస్ బేలా త్రివేది విచారించారు. ఈ కేసులో చార్జీషీటు దాఖ‌లు చేసినందున బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని న్యాయ‌మూర్తి తేల్చిచెప్పారు.

Chandrababu Naidu: ఆనాటి ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేసు విచార‌ణ‌లో అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు నాయుడుకు సుప్రీంకోర్టు సూచించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *