Chandrababu Naidu: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలి” అని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సింగపూర్ పర్యటన కొనసాగుతుందని చెప్పారు.
తెలుగు ప్రజల గర్వకారణం
సౌత్ ఈస్ట్ ఏషియా తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు,
- తెదేపా హయాంలో మూడేళ్లలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
- ఆ కాలంలో పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు పెట్టడంపై విమర్శలు వచ్చినా, భవిష్యత్తు ఐటీ, నాలెడ్జ్ ఎకానమీదేనని నమ్మకంతో ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
- సింగపూర్‌లో 40 వేల మంది తెలుగు ప్రజలు ఉండటం గర్వకారణమని తెలిపారు.
- ప్రపంచంలోని 120కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారంటే ఇది తెలుగు జాతి ప్రతిభకు నిదర్శనమని అన్నారు.
ఇది కూడా చదవండి: New Ration Cards: కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
అమరావతి, సింగపూర్ సహకారం
అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు.
బ్రాండ్ ఏపీ ప్రాధాన్యం
“ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీకి నష్టం జరుగుతుంది” అని సింగపూర్ ప్రభుత్వానికి వివరించినట్టు చెప్పారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు, పెట్టుబడులపై విశ్వాసాన్ని పెంచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు.