Chandrababu Naidu: రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లిని పేదరికం లేని జిల్లాగా మారుస్తా మని సీఎం వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీకాకు ళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా సూపర్ 6 అమల్లో భాగంగా పేద మహి ళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకా రం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని నేడు అనకాపల్లి జిల్లా పర వాడ మండలం వెన్నెలపాలెం చేరుకున్న సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారా యణమూర్తి, కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, కె ఎస్ ఎన్ ఎస్ రాజు తదితరులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం గా 860 కోట్ల రూపాయలతో గుంతలు పడిన రోడ్ల ను పూడ్చే కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు వెన్నెలపాలం నుండి శ్రీకారం చుట్టారు. అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గుంతల రోడ్లు నరకానికి చిరునామాగా ఉన్నాయన్నారు. గతంలో రోడ్ల మీద గర్భిణీలు డెలివరీ అయ్యారని.. ఈ పాపం గత వైసీపీ పాలకులదే అంటూ మండిపడ్డారు. రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని, సంక్రాం తి లోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలి. రౌడీ రాజకీయాలు వద్దు..అభి
వృద్ధి రాజకీయాలు కావాలని సీఎం ఉద్ఘాటించారు . 2014-19లో రహదారులు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోవాలని, చరిత్రలో ఎన్నడూ లేని విధం గా 24 వేల కి.మీ సిమెంట్ రోడ్లు వేశామన్నారు. రహదారులపై గుంతలు లేకుండా చూసే బాధ్య త మాది. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ భూతం రాకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు.

