Chandrababu Naidu: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల మనమడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి దంపతుల తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం (మార్చి 21) తిరుమలలో సందడిగా జరిగింది. తొలుత నారా కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకొని, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేదపండితులు నారా కుటుంబ సభ్యులను సత్కరించి, ఆశీర్వచనాలు పలికారు. ముందుగా మహాద్వారా వద్ద ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.

Chandrababu Naidu: స్వామివారి దర్శనం అనంతరం తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను నారా చంద్రబాబు నాయుడి కుటుంబం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా అందజేశారు. అనంతరం అన్నప్రసాద కేంద్రంలో చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ అక్కడి భక్తులకు అల్పాహారం వడ్డించారు.

Chandrababu Naidu: నారా కుటుంబం దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా తిరుమల శ్రీవారిని దర్శించుకొని, అన్నదానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా వారు రావడం విశేష సంతరించుకున్నది. ఈ కార్యక్రమాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


