CM Chandrababu

CM Chandrababu: మంగళగిరిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించి, ప్రజల జీవితాల్లో ఆర్థిక వృద్ధిని తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు సీఎం. ఈ పథకంలో భాగం కావడానికి సుమారు 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు.

సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది ధనికులు, ఆర్థికంగా వెనుకబడిన 20 శాతం మంది పేదలకు సహాయం చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం మార్చి 30, 2025న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించగా ఇప్పటి వరకు బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్ షిప్. ఈ విధానంలో ప్రభుత్వం కేవలం ఒక వేదికగా ఉండి, దాతలు నేరుగా పేద కుటుంబాలకు సహాయం అందిస్తారు.

ఇది కూడా చదవండి: BJP MP: రేప్ చేసి హత్య చేస్తా.. ఎంపీకి బెదిరింపులు.. స్పందించిన మహీంద్రా గ్రూప్ కంపెనీ

పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించారు. మార్గదర్శులుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు.ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ పథకంలో ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలలో నేరుగా పాలుపంచుకోదు. దాతలు (మార్గదర్శులు), పేదల (బంగారు కుటుంబాలు) మధ్య ఒక వేదికను మాత్రమే కల్పిస్తుంది.

2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. లబ్ధిదారుల వివరాలను సేకరించి, వారి అవసరాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.ఈ పీ-4 కార్యక్రమం ద్వారా సామాజిక, ఆర్థిక సాధికారతను సాధించవచ్చని, ఇది దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  YS Jagan: పెన్ను పేపర్ కి 10 కోట్లు..జగన్ గిన్నిస్ రికార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *