Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు VIZAG నగరానికి కొత్త నిర్వచణం ఇచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ నగరానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. తాజాగా వైజాగ్ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతున్న సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేయడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది.
Chandrababu Naidu:విశాఖ నగరంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రారంభమైన 30వ సీఐఐ సదస్సు రేపు కూడా కొనసాగతున్నది. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖులు అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అదే పోస్టులో వైజాగ్ ప్రాధాన్యాన్ని తెలిపేలా పేర్కొనడం విశేషం.
Chandrababu Naidu:V అంటే విజన్, I అంటే ఇన్నోవేషన్, Z అంటే జీల్, A ఆస్పిరేషన్, G అంటే గ్రోత్ అంటూ VIZAG అనే పేరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నిర్వచనం ఇచ్చారు. వేగవంతమైన వ్యాపార పద్ధతులు అందరికీ అర్థమయ్యేలా, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించేందుకే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
Chandrababu Naidu:30వ సీఐఐ సదస్సుకు దేశవిదేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సులో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వివిధ దేశాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు రానున్నారు. ఇదే సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా మంత్రి అలెక్సీ సహా భారతదేశ కేంద్ర మంత్రులు కూడా విశాఖకు చేరుకున్నారు.

