Chandrababu Naidu:

Chandrababu Naidu: చంద్ర‌బాబుకు బిల్ గేట్స్ గిఫ్ట్

Chandrababu Naidu: మైక్రోసాఫ్ట్ కో ఫౌండ‌ర్, ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రైన‌ బిల్‌గేట్స్ త‌న‌కు ఓ గిఫ్ట్ ఇచ్చార‌ని ఆంధ్రప్ర‌దేశ్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. బిల్‌గేట్స్ ర‌చించిన సోర్స్ కోడ్ పుస్తకాన్ని త‌న‌కు కానుక‌గా ఇచ్చార‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ మేర‌కు బిల్‌గేట్స్ కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Chandrababu Naidu: బిల్‌గేట్స్ ఇచ్చిన ఈ సోర్స్ కోడ్ పుస్త‌కంలో ఆయ‌న జీవిత విశేషాలు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు చెప్పారు. బిల్‌గేట్స్ కాలేజీని వ‌దిలి మైక్రోసాఫ్ట్ ను ఎలా ప్రారంభించారు? ఆయ‌న జ‌ర్నీకి సంబంధించిన అనుభ‌వాలు, పాఠాల‌ను అందులో పొందుప‌ర్చార‌ని తెలిపారు. ఈ పుస్త‌కం చాలా మందికి స్ఫూర్తినిస్తుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

Chandrababu Naidu: ఇటీవ‌ల దావోస్‌లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరం స‌దస్సు స‌మ‌యంలో చంద్ర‌బాబు, బిల్‌గేట్స్ క‌లుసుకున్నారు. అనంత‌రం ఆ పుస్త‌కాన్ని త‌న‌కు పంపినందుకు చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 1995 నుంచే నారా చంద్ర‌బాబు నాయుడుకు, బిల్ గేట్స్‌కు స‌త్సంబంధాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *