Chandrababu Naidu:

Chandrababu Naidu: నిరుద్యోగుల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌.. ఏప్రీల్‌లోనే ఆ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శుభ‌వార్త‌ను అందించారు. వ‌చ్చే ఏప్రిల్ నెల తొలివారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని తాజాగా ప్ర‌క‌టించారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం నాటికే పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల నియామ‌కం పూర్తిచేస్తామ‌ని వెల్ల‌డించారు. స‌చివాలంలో జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో మాట్లాడుతూ సీఎం ఈ ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆనందంలో ఉన్నారు.

Chandrababu Naidu: గ‌త ఐదేండ్ల‌లో రాష్ట్రం విధ్వంసానికి గురైంద‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు ఆ విధ్వంస పాల‌న‌తో రాష్ట్ర ప్ర‌జ‌లు విసిగి వేసారి పోయారని క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ అన్నారు. సుపరిపాల‌న‌, సంక్షేమం, అభివృద్ధి ప్ర‌జ‌ల‌కు అందాల‌ని తాము ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణను పూర్తి చేశాకే డీఎస్సీని భ‌ర్తీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు. 2027 నాటికి పోల‌వరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామ‌ని, అమ‌రావ‌తి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్ర‌పంచంలోనే బెస్ట్ మోడ‌ల్‌తో అమ‌రావ‌తిని అభివృద్ధి చేస్తామ‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

Chandrababu Naidu: పాఠ‌శాల‌లు తెరిచేలోగా అంటే మే నెల‌లోనే త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఎంత మంది పిల్ల‌లు ఉంటే అతమందికి ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. స్వ‌ర్ణాంధ్ర 2047 విజ‌న్‌ను 10 సూత్రాల ఆధారంగా ప‌నిచేయాల‌ని ఆకాంక్షించారు. రాష్ట్రం, జిల్లా, నియోజ‌క‌వ‌ర్గం, మండ‌లం, గ్రామ స‌చివాల‌యాల వ‌ర‌కూ ఈ ప్ర‌ణాళిక‌లు చేరాల‌ని కోరుకున్నారు. వ‌చ్చే ఏడాదికి 15 శాతం ప్ల‌స్ జీఎస్ఓపీ సాధించేలా క‌లెక్ట‌ర్లు కృషి చేయాల‌ని, వ్య‌వ‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ త‌దిత‌ర అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. జీఎస్‌డీపీ జీవీఏల‌తోపాటు త‌ల‌స‌రి ఆదాయం గ‌ణ‌నీయంగా పెరిగేలా చొర‌వ చూపాల‌ని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *