Ramoji Excellence Awards: ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపక అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల’ ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని సత్కరించే ఈ కార్యక్రమంలో రాజకీయ, న్యాయ, సినీ రంగాల ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను మరింత శోభాయమానం చేశారు.
దిగ్గజాల సమక్షం
రామోజీరావు స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏర్పాటు చేసిన ఈ పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఆయనతో పాటు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
వంటి రాజకీయ, న్యాయ ప్రముఖులు విచ్చేయడం ఈ వేదిక ప్రాధాన్యతను చాటింది. వీరితో పాటు సినీ ప్రముఖులు మురళీమోహన్, బ్రహ్మానందం తదితరులు కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Aadhaar Camps: ఏపీలో నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు.. ఎప్పటి వరకు అంటే..?
ఏడు రంగాల్లో ప్రతిభకు పట్టాభిషేకం
రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ద్వారా ఏడు కీలక రంగాల్లో సమాజ హితమే లక్ష్యంగా పనిచేసిన వారికి పురస్కారాలు అందించారు.
-
జర్నలిజం
-
గ్రామీణాభివృద్ధి
-
మానవ సేవ
-
సైన్స్ అండ్ టెక్నాలజీ
-
కళ-సంస్కృతి
-
యూత్ ఐకాన్
-
మహిళా సాధికారత
ఈ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వారికి ఈ వేదికపై అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు.
చంద్రబాబు-రేవంత్ ‘స్నేహ’ దృశ్యం
ఈ వేడుకలో రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన అంశం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రవర్తించిన తీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కపక్కనే కూర్చొని కనిపించారు. సాధారణంగా రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించడం అరుదుగా మారింది.
అలాంటిది, ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఇద్దరు నేతలు నవ్వులు చిందిస్తూ, ముచ్చటించుకుంటున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా సంభాషించుకోవడం రాష్ట్రాల మధ్య సంబంధాల మెరుగుదలకు సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దృశ్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Scene of the Day బాబు రేవంత్ ల..నవ్వులే నవ్వులు..
#ChandrababuNaidu #RevanthReddy #AndhraPradesh #Telangana #Hyderabad pic.twitter.com/IBTAvYyuj9
— YK TV Network (@YKTvNetwork) November 16, 2025
