Chandrababu at Tirumala: తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది . ఈరోజు ఉదయం అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు . అనంతరం తిరుమల పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు . ఈ సమీక్షలో మంత్రి ఆనం, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఏఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు అని చెప్పారు . ఆలాగే ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు. ఏ విషయంలోనూ రాజీపడొద్దని సూచించారు . భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అని చెప్పిన ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలన్నారు . అటవీసంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు . బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్న .
టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు . ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు . భక్తుల సూచనల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలి ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల సూచనలు తీసుకోవాలి అని చంద్రబాబు దశా నిర్దేశం చేశారు . పక్కనే ఉన్న మంత్రి ఆనం కు భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని సూచించారు .
“లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు ప్రసాద నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి.. మరింత మెరుగుపడాలి ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు . తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని చెప్పిన చంద్రబాబు . . ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు .
తిరుమలలో ఎటు చూసినా ఆధ్మాత్మికత ఉట్టిపడేలా ఉండాలి.. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని అధికారులకు స్పష్టంగా చెప్పారు . ఇక భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలన్నారు . అలాగే , దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చేవారిని గౌరవించాలనీ.. భక్తులు సంతృప్తితో, మంచి అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలనీ చంద్రబాబు అధికారులకు చెప్పారు .

