Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పవన్ కళ్యాణ్ పై తమ హృదయపూర్వక అభిమానం, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు..
చంద్రబాబు నాయుడు ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు చేస్తూ, “అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకు కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం… స్పందించే హృదయం — ఇవన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల దీవెనలతో మీరు నిండునూరేళ్లు వర్ధిల్లాలి. రాష్ట్ర పాలనలో, అభివృద్ధిలో మీ పాత్ర మరువలేనిది” అని పేర్కొన్నారు.
మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకి కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం….స్పందించే హృదయం…అన్నీ కలిస్తే… pic.twitter.com/TqlmiEIwBZ
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2025
నారా లోకేష్..
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన శుభాకాంక్షల్లో, “వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, ప్రజల కోసం రాజకీయాల్లో అడుగుపెట్టి పీపుల్ స్టార్‌గా ఎదిగిన పవనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు కట్టుబడి నిలుస్తారన్న మీ తత్వం ప్రశంసనీయం” అని అన్నారు.
వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు… pic.twitter.com/QEKiv9mInU
— Lokesh Nara (@naralokesh) September 2, 2025