Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన తెలిపారు.
“ప్రధాని వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తే, మనం స్వర్ణాంధ్ర 2047ను సాధించడానికి కృషి చేస్తున్నాం. ఏపీలోని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది మా సూపర్ సిక్స్‌లో ఒకటి… సూపర్ హిట్ అవుతుంది” అని సీఎం అన్నారు.