Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 6వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ. 33,720 కోట్ల విలువైన 19 పారిశ్రామిక ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రూపుదిద్దుకోనున్నాయి.
వీటి ద్వారా 34,621 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నట్లు అంచనా. ఇటీవలి కాలంలో పెట్టుబడిదారుల విశ్వాసం మరల కలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇస్తున్నాయి. గత 11 నెలల వ్యవధిలో SIPB మొత్తం ఆరు సమావేశాలు నిర్వహించి 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి కలిపి రాష్ట్రానికి రూ.4.95 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించాయి.
6వ SIPB సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు:
ఐ అండ్ సి విభాగం:
1. డెక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ – కుమరవరం, అనకాపల్లి జిల్లా: రూ.1,560 కోట్లు, 1,800 ఉద్యోగాలు
2. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా: రూ.1,400 కోట్లు, 800 ఉద్యోగాలు
3. పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ – ఓర్వకల్, కర్నూలు జిల్లా: రూ.1,286 కోట్లు, 1,200 ఉద్యోగాలు
4. బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ – రాంబిల్లి, అనకాపల్లి జిల్లా: రూ.2,300 కోట్లు, 1,750 ఉద్యోగాలు
5. జుపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రాంబిల్లి, అనకాపల్లి జిల్లా: రూ.2,700 కోట్లు, 2,216 ఉద్యోగాలు
టెక్స్‌టైల్ విభాగం: 6. రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ – తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా: రూ.228 కోట్లు, 250 ఉద్యోగాలు
7. మోహన్ స్పింటెక్స్ – మాలవల్లి, కృష్ణా జిల్లా: రూ.482 కోట్లు, 1,525 ఉద్యోగాలు
8. ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ – అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా: రూ.1,779 కోట్లు, 600 ఉద్యోగాలు
ఏపీఐఐసీ విభాగం: 9. వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ – తిరుపతి జిల్లా: రూ.1,061 కోట్లు, 10,098 ఉద్యోగాలు
10. అలీప్ కుప్పం – చిత్తూరు జిల్లా: రూ.5 కోట్లు, 1,500 ఉద్యోగాలు
ఎనర్జీ విభాగం: 11. నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – ఏలూరు జిల్లా: రూ.150 కోట్లు, 500 ఉద్యోగాలు
12. దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ – అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు: రూ.2,920 కోట్లు, 230 ఉద్యోగాలు
13. ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కడప జిల్లా: రూ.3,941 కోట్లు, 260 ఉద్యోగాలు
14. బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ – అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు: రూ.9,000 కోట్లు, 3,900 ఉద్యోగాలు
టూరిజం విభాగం: 15. బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పీ – తిరుపతి: రూ.150 కోట్లు, 350 ఉద్యోగాలు
16. స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – తిరుపతి: రూ.327 కోట్లు, 570 ఉద్యోగాలు
17. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ – విశాఖపట్నం: రూ.899 కోట్లు, 1,300 ఉద్యోగాలు
ఐటీ విభాగం: 18. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – శ్రీ సిటీ, తిరుపతి జిల్లా: రూ.2,475 కోట్లు, 5,150 ఉద్యోగాలు
19. సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ – కర్నూలు జిల్లా: రూ.1,057 కోట్లు, 622 ఉద్యోగాలు
ఈ ప్రాజెక్టుల అమలుతో రాష్ట్ర పరిశ్రమల రంగానికి బలం చేకూరనుండగా, యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.