Chandrababu: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం 

Chandrababu: చేనేత కార్మికులకు ఇచ్చిన మాటపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలకు గురవుతున్న నేపథ్యంలో, వారికి 50 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేతలు ప్రతీకలుగా నిలుస్తున్నారని కొనియాడారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో చేనేత కళను ప్రతిబింబించే మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

చేనేత రంగానికి బలమైన మద్దతు

వ్యవసాయ రంగానికి తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని సీఎం అన్నారు. గతంలో 55,500 మందికి రూ.27 కోట్లు రుణంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించామన్నారు.

ఇకపై మరమగ్గాల కార్మికులకు మరింత సహాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ రంగానికి 50 శాతం సబ్సిడీతో రూ. 80 కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల నుంచే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించబోతున్నామని, భవిష్యత్తులో ఇది 500 యూనిట్లకు పెంచనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, సవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *