Chandoo Mondeti

Chandoo Mondeti: చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య మరో సినిమా! హిస్స్టారికల్ పాత్రలో చైతూ?

Chandoo Mondeti: లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన తెనాలి రామకృష్ణ. ఆ సినిమాలో అక్కినేని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అయితే, ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రలో ఆయన మనవడు నాగచైతన్య కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ చిత్ర సక్సెస్ మీట్‌ కి అక్కినేని నాగార్జున గెస్టుగా వచ్చి చిత్ర యూనిట్‌ను అభినందించాడు. ఇక ఈ సక్సెస్ మీట్‌లో దర్శకుడు చందూ మొండేటి అక్కినేని అభిమానులకు ఓ సూపర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. తాను చైతూతో తెనాలి రామకృష్ణ హిస్టారిక్ చిత్రాన్ని తీయబోతున్నానని.. దీని కోసం తాను పక్కా ప్లానింగ్‌తో తనదైన స్టైల్‌లో ప్రెజంట్ చేస్తానని చందూ మొండేటి చెప్పుకొచ్చాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sankranthiki Vasthunnam: స్మాల్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయిన సంక్రాంతికి వస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *