Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ దశకు చేరుకుంది. అయితే మిగిలిన జట్ల ఆటగాళ్లు మరియు మాజీ ప్లేయర్లు టీమిండియా దుబాయ్ లోనే అన్ని మ్యాచ్ లు ఆడుతుందని… ఇది వారికి ఎంతో సానుకూల అంశం అని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియాలో కూడా పదేపదే రుద్దేస్తున్నారు. అక్కడ ఆగకుండా మిగిలిన జట్లు వేరువేరు మైదానాలకు ప్రయాణం అవుతూ ఉంటే టీమిండియా మాత్రం తమకు అలవాటవుతున్న మైదానంలోనే మిగిలిన టోర్నమెంట్ ఆడబోతుందని తెగ విమర్శలు చేస్తున్నారు. పైగా ఐసిసి భారత్ కు కావాలని మేలు చేస్తోందని అంటున్నారు. అయితే దుబాయ్ లోనే మొత్తం టోర్నమెంట్ ఆడడం టీమిండియా కు ప్రతికూల అంశం ఎలాగో చూద్దాం…
మొదట భారత్ పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించడంతో తమకు తటస్థ వేదిక కావాలని ఐసీసీను సంప్రదించింది. ఇక అందుకు దుబాయ్ ను కేటాయించిన ఐసీసీకి మరొక ఆప్షన్ లేదు. భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ జరగడం అసంభవం. స్పాన్సర్లు ఎవరూ ముందుకు రారు. ఇక ఈ విషయంలో రాజకీయపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఎందుకు ఐసీసీ ని కానీ బీసీసీఐ ని కానీ తప్పు పట్టడానికి లేదు.
తర్వాత విషయానికి వస్తే 2023లో భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే ప్రపంచ కప్ లో మొత్తం పది మ్యాచ్లను టీమిండియా 10 వేరు వేదికల్లో ఆడింది. ఆటోర్నమెంట్ లో ప్రతి జట్టు ఒకే మైదానంలో కనీసం రెండు మ్యాచ్ లు ఆడగలిగాయి. పాకిస్తాన్ అయితే ఏకంగా మూడు మ్యాచ్లను హైదరాబాద్ లోనే ఆడింది. కానీ భారత్ కు స్వంత దేశంలో టోర్నమెంట్ జరిగినప్పటికీ అలాంటి వెసులుబాటు లేదు. ఆ సమయంలో ఎవరూ ఈ విషయం పైన జాలి చూపించలేదు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్న విరాట్ కోహ్లీ
ఇక దుబాయ్ వంటి స్లో పిచ్ ల పైన టీమిండి ఆడడం వారికే ఇబ్బంది. టీమిండియా బ్యాటర్లు పాకిస్తాన్ లోని బ్యాటింగ్ పిచ్ ల పైన చెలరేగి ఆడుతారు. ఇండియా స్ట్రోక్ ప్లేయర్లు అయిన రోహిత్, విరాట్, అయ్యర్ లకు అక్కడ భారీ స్కోరు చేసే వీలు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 250 పరుగులు చేయడానికి కష్టపడాలి. పైగా భారత స్పిన్నర్లకు, మిగిలిన జట్ల స్పిన్నర్లకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ పిచ్ తగ్గిస్తుంది. సరైన వేగంతో సరైన చోట బంతివేస్తే పిచ్ అందుకు తగినట్లుగా దుబాయ్ లో స్పందిస్తుంది. మిగిలిన మైదానాల్లో స్పిన్నర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు 2023 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో ముంబై ఇలాంటి బ్యాటింగ్ పిచ్ పైన భారత్ ప్లేయర్లు చెలరేగి భారీ స్కోరు సాధించారు. కానీ అహ్మదాబాద్ లో స్లో పిచ్ ఎదురైంది. ఫైనల్ లో భారత అరకొర స్కోరుతో సరిపెట్టుకున్నారు. ఇక దుబాయ్ లో కూడా అహ్మదాబాద్ ఫైనల్స్ లో లాగే ప్రత్యర్థి జట్టు చేజింగ్ ఎంచుకొని రాత్రికి మంచు కనుక వస్తే… ఇక భారత స్పిన్నర్లు ప్రభావం ఏ మాత్రం పనిచేయదు. ఇటువంటివి ఏమి ఆలోచించకుండా భారత జట్టు వరుసగా అన్ని అడ్డంకులను అధిగమించి విజయాలు సాధిస్తుంటే అనవసరమైన విమర్శలు చేస్తున్నారు.